Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురి మృతి, అనుమానితుడి అరెస్ట్
ఒట్టావా : కెనడాలోపి పెంటిక్టన్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు రాయల్ కెనడీయన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) అధికారులు వెల్లడించారు. నిందితుడు కాల్పులకు పాల్పడ్డ కారణం తెలియరాలేదు. ఈ ఘటనకు ఉగ్రవాదం సంబంధమున్నట్టు పోలీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఆర్సీఎంపీ రీజినల్ కమాండర్ టెడ్ డీ జాగెర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు కెనడా ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొంది.