Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: స్పెయి న్లోని ఓ 57 అంతస్తుల భవనానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రంగంలోకి దిగి భవనాన్ని ఖాళీ చేయిం చారు. పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని పాసియో డి లా కాస్టెలానా ప్రాంతంలో ఉండే ఈ భవనం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆకాశహర్మ్యం. మొత్తం 57 అంతస్తులు గల ఈ భవనంలో పలు ఆఫీసులతో పాటు నాలుగు దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు కూడా ఉన్నాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు చెందిన ఎంబసీలు ఇక్కడ ఉన్నాయి. అత్యంత భద్రత కలిగిన ఈ ఎత్తయిన భవనానికి బాంబు బెదిరింపు రావడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబు స్క్వాడ్ పాసియో డి లా కాస్టెలానాలోని భవనంలో తనిఖీలు చేపట్టారు.