Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖార్తౌమ్ : సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ని ఖార్తౌమ్లోని కోబర్ జైలుకు తరలించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడిం చారు. కాగా, సుడాన్లో సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. మూడు దశా బ్దాల పాటు సుడాన్ని పాలించిన బషీర్ని ఇక్కడి సైనికులు బలవంతంగా గద్దె దించారు. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గతేడాది గురువారం బషీర్ని అరెస్ట్ చేసిన సైన్యం ఎక్కడ దాచిపెట్టిందో వెల్లడించలేదు. తాజాగా, ఆయన్ను కోబర్ జైలుకు తరలించినట్టు ధ్రువీకరించింది. కాగా, సైనిక పాలనను వ్యతిరేకిస్తూ సుడాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్మీ పాలన మాకొద్దంటూ నిరసనకారులు రోడ్లెక్కారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.