Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉల్కపాతం సమయంలో చంద్రుడిపై నీళ్లు
న్యూయార్క్: భూమిపై నీరు ఉన్నట్టుగానే చంద్రుడిపై కూడా నీటి ఆనవాళ్లు గుర్తించినట్టు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉల్కపాతాల సమయంలో చంద్రుడి ఉపరితలంపై నీళ్లు చిమ్మినట్టు నాసా పరిశోధనల్లో తేలింది. స్పేస్ ఏజెన్సీ ల్యూనర్ అట్మోస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ ప్లోరర్ లాడీ అనే రోబెటిక్ మిషన్ ఆధారంగా నీళ్లు ఉన్నట్టు గుర్తించింది. 2013, అక్టోబర్ నుంచి 2014, ఏప్రిల్ నుంచి చంద్రుడి ఉపరితలంలోకి పంపిన రోబొటిక్ మిషన్ అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి నాసాకు చేరవేసింది.
ఇప్పటివరకూ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కనిపించాయి. చంద్రుడిపై ఉన్న నీరు క్రమంగా బయటకు ఊరుతున్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా, జాన్హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్త పరిశోధనలో చంద్రుడిపై నీళ్లు ఉద్భవించడం నిజమేనని గుర్తించారు. ఉల్కపాతం సమయంలో ఉల్కలు చంద్రుడి ఉపరితలంపై పొరను బలంగా ఢకొీట్టినప్పుడు సన్నని పొర చీలిపోయి ఆ పొర లోపలి నుంచి నీరు చిమ్మినట్టు పరిశోధనలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త పరిశోధ నకు సంబంధించి విషయాలను నేచురల్ జియో సైన్సెస్లో మెహదీ బెన్న ఆఫ్ నాసా ఫ్లయిట్ సెంటర్ ప్రచురించింది.
చంద్రుడిపై నీళ్లు ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని విషయాలను శోధించేందుకు వీలు అవుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉల్కలు చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు అక్కడి మంచురూపంలో ఉన్న నీరు ఒక్కసారిగా ఆవిరి రూపంలో బయటకు చిమ్మినట్టు పరిశోధనలో నాసా గుర్తించింది. ఉల్కలకు, నీటికి సంబంధం ఏంటి? ఉల్కలు పడిన సమయాల్లో నీరు ఎలా బయటకు వస్తుంది అనేదానిపై నాసా విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. కాగా, ఈ మిషన్ను పర్యవేక్షిస్తున్న ల్యూనర్ అట్మోస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ ప్లోరర్ లాడీ అనే ఈ రోబోను నాసాకు చెందిన ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ రూపొందించింది. ఇది కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉంది. ఈ రోబోకు అమర్చిన న్యూట్రల్ మాస్ స్పెక్ట్రోమీటర్ చంద్రుడిపై నీటి ఆవిరి కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది.