Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా, బ్రిటన్ తోడు దొంగలు :అసాంజే అరెస్టుపై రోగర్ వాటర్స్
లండన్ : వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జూలియన్ అసాంజేను లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి బయటకు పంపించడం విచారకరమని ప్రముఖ సంగీత విద్వాంసుడు రోగర్ వాటర్స్ అన్నారు. అసాంజే అరెస్టుపై ఆయన తన మనోభావా లను రాయిటర్స్ పత్రికతో పంచుకున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి బ్రిటన్ ఒక సహచరిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా మేధావుల దృష్టిలో అసాంజే ఒక ముల్లు లాంటి వాడు. అతడ్ని బంధించేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో వివరించారు. బాగా ఆలోచిస్తే అమెరికా సామ్రాజ్యానికి బ్రిటన్ ఒక శాటిలైట్‌గా ఉపయోగపడుతున్నదే మోనని తనకు అనిపిస్తున్నదని తెలిపారు. ఇది ఒక ఆంగ్లేయుడిగా తనకు అవమాన కరంగా ఉందన్నారు. ఈక్వెడార్ ఏడేండ్ల కిందట అసాంజేకు ఇచ్చిన రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకోవ డంతో అతన్ని అరెస్టుచేసిన విషయం విదితమే. ఈక్వెడార్ పౌరసత్వంతోనే ఆయన విజిల్ బ్లోయర్‌గా ఖ్యాతికెక్కారు. అసాంజేను అభియోగాలు ఎదుర్కొంటున్న స్వీడన్ పంపాలా, అమెరికాకు పంపాలా అనే విషయమై బ్రిటన్అధికా రులు త్వర లోనే నిర్ణయం తీసుకోనున్నారు. స్వీడన్లో ఆయనపై లైంగికదా డులు అభియోగాలు నమోదు కాగా, అమెరికా మాత్రం తమ దేశానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను దొంగచాటుగా తీసుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నది.