Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిఫిక్ సముద్రంలో14 వేల కిలోమీటర్ల ప్రయాణం
టోక్యో: జపాన్‌కు చెందిన మిట్సుహిరో ఇవామోటో(52) అనే ఓ అంధ నావికుడు చరిత్ర సృష్టించాడు. కళ్లు లేనప్ప టికీ 12 మీటర్ల బోటులో అమెరికా నుంచి జపాన్ వరకు పసిఫిక్ సము ద్రంలో(14 వేల కిలోమీటర్లు) ప్రయా ణం చేసుకుంటూ వచ్చేశాడు. శని వారం జపాన్‌కు చేరుకున్న ఇవా మోటోకు అనేకమంది ఘనస్వాగతం పలికారు. ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో మరోవ్యక్తి(దారి చెప్పడా నికి)తో కలిసి ప్రయాణం మొదలుపెట్టగా.. శనివారం ఫుకుషిమా పోర్టుకు విజయవంతంగా చేరుకున్నాడు. ఆరేండ్ల క్రితం ఇలాంటి సాహసమే చేయగా.. మధ్య దారిలో తిమింగలం బోటుకు తగలడంతో బోటు మునిగిపోయింది. అయినప్పటికీ ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు అంటూ మరోసారి సాహసం చేసి విజయం సాధించాడు. విజయ వంతంగా తన ఇంటికి చేరుకోవడం గర్వంగా ఉందంటూ తన కల నెరవేరిందని ఇవామోటో ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇవా మోటోకు 16 ఏండ్ల వయసులో అనుకోని పరిస్థితుల్లో చూపును కోల్పోయారు. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదంటూ అప్పటి నుంచి విరాళాలను సేకరిస్తూ ఎంతో మంది సహాయపడుతూ వస్తున్నారు.