Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్ సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం
వాషింగ్టన్: అమెరికాలోని అలబామా రాష్ట్రం గర్భస్రావాన్ని (అబార్షన్) నిషేధించింది. చట్టసభ ప్రతినిధులు దీనికి సంబంధించి బిల్లును పాస్ చేశారు. 25 మంది సెనెటర్లు ఈ బిల్లుకు ఆమోదం తెలపగా, కేవలం ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. అయితే ఆ బిల్లుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అబార్షన్ మద్దతుదారులు చెబుతున్నారు. కానీ, ఆ బిల్లుపై వేసిన అభ్యర్థనలు, సమస్యను సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్తాయని భావిస్తున్నారు. 1973లో రూపొందించిన అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తాజాగా బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికాలోని మరో 16 రాష్ట్రాలు కూడా గర్భస్రావంపై అదనంగా కొన్ని నిబంధనలు జోడించాలని భావిస్తున్నాయి. సెనెట్‌లోని నలుగురు మహిళా సెనెటర్లు గర్భస్రావంపై నిషేధానికి మద్దతివ్వలేదు. ఈ బిల్లుపై గవర్నర్ కే ఐవీ సంతకం పెట్టాల్సి ఉంది. గర్భస్రావంపై నిషేధం బిల్లుపై ఆమె అభిప్రాయం తెలియాల్సి ఉంది. గర్భం ధరించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ దశలోనైనా అబార్షన్ చేసుకోకూడదన్న నిబంధనతో కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. అబార్షన్ చేసే డాక్టర్లను నేరస్తులుగా కూడా పరిగణించనున్నారు. వారికి 10 ఏండ్ల నుంచి 99 ఏండ్ల వరకు శిక్షను విధించాలని నిర్ణయించారు. కేవలం తల్లికి ప్రమాదం ఉందన్న కేసుల్లో మాత్రమే అబార్షన్ చేసేందుకు వీలుంటుంది. లైంగికదాడికి గురైన బాధితులు కూడా గర్భాన్ని తొలగించరాదన్న మరో నిబంధనను చేర్చారు. అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే, ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే ట్రంప్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నది. తొమ్మిది మంది సభ్యులు ఉండే సుప్రీంలో.. ట్రంప్ నియమించిన కన్జర్వేటివ్ జడ్జీలు కూడా ఎక్కువే ఉన్నారు. 1973 నాటి తీర్పును రద్దు చేయాలన్న ఉద్దేశంతో కన్జర్వేటివ్‌లు ఉన్నారు. దీంతో, ప్రస్తుతం అలబామాలో అబార్షన్‌పై నిషేధం విధించడం ఓ సంచలనంగా మారింది. ఈఏడాది అబార్షన్ చట్టంపై సవరణలు చేపట్టి నూతన చట్టాలన్ని అమల్లోకి తీసుకురావాలని భావించిన లూసియానా రాష్ట్రానికి యూఎస్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.