Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలట్ సురక్షితం, ఐదుగురికి గాయాలు
కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు ఓ పరిశ్రమ గిడ్డంగిని ఢకొీట్టింది. యుద్ధ విమాన శిక్షణ ఇస్తున్న సమయంలో దక్షిణ కాలిఫోర్నియా వైమానిక కేంద్రం సమీపంలోని పరిశ్రమ గిడ్డంగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడగా.. మరో ఐదుగురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. గిడ్డంగిలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. యుద్ధ విమానం బలంగా ఢకొీట్టడంతో పరిశ్రమ గిడ్డంగి పైకప్పులో పెద్ద రంధ్రం ఏర్పడినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.