Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐఏ మాజీ అధికారికి 20 ఏండ్ల జైలు
వాషింగ్టన్ : గూఢచర్యం ఆరోపణలపై సీఐఏ మాజీ అధికారి కెవిన్ మాలోకి(62)కి 20ఏండ్ల జైలుశిక్ష పడింది. అమెరికా రక్షణశాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనాకు అందించిన అభియోగాలను కెవిన్ ఎదుర్కొన్నారు. ఆయనపై మోపిన ఆరోపణలు రుజువైనందున 20ఏండ్ల జైలుశిక్ష విధించినట్టు యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి టీఎస్ ఎలియస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం... కెవిన్ వర్జీనియా మిలిటరీ కమాండ్ సెంటర్లో సేవలందించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కీలక అధికారిగా పేరు తెచ్చుకున్నారు.2012వరకు సీఐఏలో సేవలందించిన కెవిన్ సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. అయితే, వ్యాపారంలో బాగా నష్టపోవడంతో 2017లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని తన మిత్రుడి ద్వారా చైనాకు చేరవేసినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. చైనా ప్రభుత్వం నుంచి అతనికి 25,000 ( రూ.17,58,700 ) డాలర్లు, ప్రత్యేకమైన ఫోన్ అందినట్టు ప్రాసిక్యూషన్ విభాగం కోర్టులో ఆధారాలు సమర్పించింది.