Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్
న్యూయార్క్ : సంకల్పం, ఆశావాద దృక్పథంతోనే తాను అభివృద్ధి పథంలో పయణించానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ అన్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ' 16ఏండ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న క్యూబా నుంచి వలసవచ్చారు. అప్పుడు ఆయనకు ఇంగ్లీష్ రాదు. కానీ ఇవేవి తన అమెరికా కల నుంచి ఆయనను దూరం చేయలేకపోయాయి. నాన్న చూపిన బాటే నాకు ఆదర్శం. కష్టకాలంలో ప్రజలు ఒకరికొరు ఏవిధంగా బాసటగా నిలుస్తారనేది నా తండ్రి అమెరికా ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టి కొత్త మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రయాణాన్ని మరోసారి గుర్తు తెచ్చుకునే అవకాశం లభించింది. ఇది తన చరిత్ర' అంటూ జెఫ్ అన్నారు.