Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016 కుట్రపై ఎర్డొగాన్ సర్కారు ఆదేశాలు
అంకారా: 2016 తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విఫల సైనిక కుట్రలో భాగస్వాములుగా ఉన్నారన్న ఆరోపణలపై టర్కీ విదేశాంగ శాఖలోని 249 మంది సిబ్బంది అరెస్ట్‌కు అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న అమెరికాలోని మత ప్రబోధకుడు ఫతుల్లా గులెన్‌తో వీరికి సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తాము వీరిపై నిరంతర నిఘా కొనసాగించి తమ అనుమానాలను నిర్ధారణ చేసుకున్న తరువాతే వీరిని అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు స్పష్టం చేశారు.