Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సనా : మక్కా వైపు క్షిపణులు ప్రయోగించలేదని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు. ఈ మేరకు హౌతి తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి యహ్జా సరియా ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిలోని వివరాల ప్రకారం....' మక్కా ముస్లింల పవిత్ర స్థలం. ఈ ప్రాంతం వైపుకు క్షిపణులు ప్రయోగించినట్టు మాపై బురద జల్లేందుకు సౌదీ కుట్ర పన్నింది. గతంలోనూ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసింది. హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడ లేదు. మక్కావైపు క్షిపణుల ప్రయోగం జరిగిందని, హౌతి తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాలపడినట్టు వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం' అని సరియా ప్రకటించారు.