Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నుకున్న పార్లమెంట్
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా ఎన్నికయ్యారు. మే8న జరిగిన సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన నూతన పార్లమెంటు ఆయనను దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. దక్షిణాఫ్రికా రాజ్యా ంగం ప్రకారం అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ప్రజలచేత ఎన్నికైన పార్లమెంటు అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అధ్యక్ష పదవికి రమఫొసా నామినేషన్ ఒక్కటే దాఖలవడంతో పోటీ లేకుండా ఆయన ఎన్నికైనట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మోగెయింగ్ మోగెయింగ్ ప్రకటించారు. శనివారం రమఫొసా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కార్మికోద్యమనేతగా పనిచేసిన రమఫొసా ప్రమాణ స్వీకారానికి అధికార, ప్రతిపో సభ్యులు పెద్దసంఖ్యలో హాజరై శుభాభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రమఫోసా మాట్లాడుతూ, తాను ఒక్క ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కే కాదు, దక్షిణాఫ్రికా ప్రజలందరికీ చెందినవాడిని అని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన, పౌరులందరి ప్రయోజనాల కోసం పాటుపడతానని, ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి శ్వేతజాతి దుర్హంకార వలస పాలకులను పారదోలి, నల్లజాతీయుల చేతికి అధికార మార్పిడి సాఫీగా జరిగేలా చూడడంలో రమఫొసా కీలక పాత్ర పోషించారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో, అధ్యక్ష బాధ్యతలను ఆయన తొలిసారి చేపట్టారు.