Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: నిరసనల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ ప్రత్యేక విమానంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో టోక్యో చేరుకుంది. ట్రంప్ బృందానికి ప్రధాని షింజోఅబే, ఇతర ఉన్నతాధికారులు సాదరస్వాగతం పలికారు. జపాన్‌కు బయల్దేరేముందు ట్రంప్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 200 ఏండ్లకోసారి జరిగే సుమో టోర్నమెంట్ (బాషో)లో ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి గౌరవ అతిథిóగా పాల్గొనటం తనకు ఆనందంగా వుందని అన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతకు ఆయన కప్‌ను బహూకరించనున్నారు. ఇక దౌత్యపరమైన సంప్రదింపుల్లో భాగంగా సోమవారం ప్రధాని అబేతో కలిసి వర్కింగ్ లంచ్‌లో పాల్గొంటారు. తరువాత ఇరువురు నేతలూ మీడియా సమావేశంలో పాల్గొంటారు. తరువాత జపాన్‌లో వున్న అమెరికా సేనలనుద్దేశించి ప్రసంగిస్తారు. సోమవారం ప్రధానితో భేటీకి ముందు ఇటీవల పట్టాభిషిక్తుడైన జపాన్ చక్రవర్తి నరుహిటోను మర్యాదపూర్వకంగా కలుస్తారు.