Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ గురువారం వెల్లడించారు. వచ్చేనెల 5 నుంచి 7వరకు జిన్‌పింగ్ పర్యటన ఖరారైందని అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగనున్న 23వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరు కావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారని చెప్పారు. పుతిన్ ఆహ్వానం మేరక్ చైనా అధ్యక్షుడు ఈ సదస్సులో పాల్గొంటారని లుకాంగ్ తెలిపారు.