Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే వారసత్వ రేసులో వున్న మాజీవిదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ గట్టిగా సమర్ధించారు.బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమ ఛాయిస్ అని ఆయన శనివారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రధాని రేసులో వున్న ఇతర అభ్యర్థులు కూడా తన మద్దతును కోరారని చెప్పారు. అయితే ఎవరెవరు తన మద్దతుకోరారన్న విషయం తాను చెప్పదల్చుకోలేదని, తాను ఎవరినైనా సమర్ధిస్తే వారికి పూర్తి సహకారం అందిస్తానని వివరించారు. బ్రెగ్జిట్లో బ్రిటన్ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రస్తుత ప్రధాని థెరెస్సా మే విఫలమయ్యారని ఆయన గత ఏడాది బ్రిటన్ పర్యటనకు ముందు ఒక ఇంటర్వ్యూలో విమర్శించిన విషయం తెలిసిందే.