Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: రహస్యపత్రాలను లీక్ చేసిన కేసులో అమెరికా కోరుతున్నట్టు వికీలీక్స్ అధినేత అసాంజేను అప్పగించే విషయంలో తాను ఎటువంటి అభ్యంతరమూ చెప్పబోనని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమీ హంట్ చెప్పారు. ప్రస్తుత ప్రధాని థెరెస్సా మే వారసత్వ రేసులో ఉన్న హంట్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ అసాంజే అప్పగింతకు సంబంధించి తాము కొంత న్యాయపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని, అదే విధంగా అమెరికా కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియను నెరవేర్చాల్సి ఉందని వివరించారు. తమ దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను వెల్లడి చేసిన కేసులో అసాంజేను తమ నిఘా చట్టం పరిధిలో ప్రాసిక్యూట్ చేయాలని అమెరికా భావిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిటన్ మంత్రి హంట్ మీడియాతో మాట్లాడుతూ అసాంజేపై కొనసాగే న్యాయవిచారణ ప్రక్రియకు తాను ఏ విధంగానూ అడ్డుతగలబోనని స్పష్టం చేశారు.