Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వెళ్లే చైనీయులకు జిన్పింగ్ ప్రభుత్వం హెచ్చరిక
బీజింగ్: అమెరికా వెళ్లే చైనీయులకు జిన్పింగ్ ప్రభుత్వం మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పోలీసుల చేతిలో వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఆ దేశంలో కాల్పులు, దొంగతనాలు తరుచూ జరుగుతు న్నాయని గుర్తుచేసింది. అమెరికా వెళ్లాలనుకునే వారు అక్కడి భద్రతా పరిస్థితులు, చట్టాలు, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపింది. కాగా, అగ్ర దేశాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో జిన్పింగ్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.