Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం తగ్గిన మంజూరు
- ట్రంప్ వలస విధానాలే కారణం
వాషింగ్టన్ : ఐటీ నిపుణులు అమెరికా వెళ్లేందుకు అత్యధికంగా వినియోగించే హెచ్1బీ వీసాల జారీ తగ్గిపోయింది. ట్రంప్ నేతృ త్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ వీసాల విషయంలో కఠినంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్ప డింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2018లో వీటి జారీ 10శాతం తగ్గింది. 2018 సంవత్సరానికి గాను రెన్యూ వల్స్సహా కలిపి 3,35,000 హెచ్1బీ వీసాలను మాత్రమే మం జూరు చేసినట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఇవే వీసాలు 2017లో 3,73,400 మంజూరు చేశారు. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తుల్లో 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి కేవలం 85కు మాత్రమే గ్రీన్ సిగల్ లభించింది. అదే ఏడాది మొదటి ఆరు నెలల్లో నూటికి 79 వీసాలను మాత్రమే ఆమోదించారు.2018లో 8.50లక్షల నేచురలై జేషన్ దరఖాస్తులను పరిష్కరించారు. ''హెచ్1బీ వీసాల వినియో గాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్రఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేశారు. ఆ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.''అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ విశ్లేషకురాలు సారా పెర్సీ తెలిపారు.