Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్లిన్ (ఐర్లండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై ఐర్లండ్ రాజధాని డబ్లిన్ నగరంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమ య్యాయి. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం వేలాది మంది ప్రజలు భారీయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నగర ప్రధాన రహదారి ప్రక్కనవున్న కానెల్ స్ట్రీట్‌లో ట్రంప్‌ను ఒక చిన్న పిల్లవాడి తరహాలో చిత్రించిన ఒక బొమ్మను ప్రదర్శించారు. వేలాది మంది ప్రదర్శనకారులు ఈ బొమ్మ వద్దకు చేరి ట్రంప్ రాకకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్దపెట్టున నినదిస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ట్రంప్ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం లాండింగ్ అయిన షానన్ విమానాశ్రయం నుంచి అమెరికా సేనలు వెళ్లిపోవాని డిమాండ్ చేస్తూ ప్రదర్శకుల్లో కొందరు బ్యానర్లను ప్రదర్శించారు. విమానాశ్రయం వద్ద వివిధ సామాజిక బృందాలు, రాజకీయ పార్టీలు, ట్రంప్ వ్యతిరేక ప్రచార ఉద్యమ నేతలు చేరి పెద్దయెత్తున నిరసన తెలియచేశారు. అనంతరం వారు ర్యాలీగా బయల్దేరి 'డొనాల్డ్ ట్రంప్ గో ఎవే' అన్న నినాదాలు చేశారు. ఐర్లండ్‌లో రెండు రోజుల పర్యటన అనంతరం శుక్రవారం నాడు ట్రంప్ అమెరికా తిరిగి వెళ్లారు.