Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీపై ఒత్తిడి పెంచిన అమెరికా
వాషింగ్టన్ : రష్యా నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం టర్కీపై ఒత్తిడి పెంచింది. ఒకవేళ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినట్టయితే గతంలో తమతో కుదుర్చుకున్న ఎఫ్-35 యుద్ధ విమానాల ఒప్పందాన్ని తామే రద్దు చేయాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. కాగా, రష్యా నుంచి ఎస్-400 యుద్ధ విమానాలను, క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయనున్నట్టు టర్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అడ్డు పడుతున్నది. ఈఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలంటూ టర్కీపై ఒత్తిడి తెస్తున్నది. అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షానహాన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. 'ఈఏడాది జులై 31లోపు అమెరికాలో శిక్షణ పొందుతున్న టర్కీ పైలట్లు తమ స్వదేశానికి వెళ్లిపోవాలి. అమెరికా నుంచి యుద్ధ విమానాలను టర్కీ కొనుగోలు చేస్తున్న కారణంగానే ఆదేశపు పైలట్లకు శిక్షణ ఇస్తున్నాం. అయితే, ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి టర్కీ తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే, ఆ దేశపు పైలట్లకు శిక్షణ నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు.