Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో స్వలింగ సంపర్కుల ( గేస్) ఆత్మ గౌరవ సన్నాహక ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆగంతకుడు ర్యాలీలో చొరబడి గేలను తుపాకీతో బెదిరించాడు. దీంతో, భయబ్రాంతులకు గురైన స్వలింగ సంపర్కులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వాషింగ్టన్ పోలీస్ కమాండర్ గిలెర్మో రివేరా తెలిపారు. నిందితుడు తుపాకీతో బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు ఫిర్యాదు చేసినట్టు పోలీస్ కమాండ్ చెప్పారు. అయితే, అతను గాల్లో తూటాలు పేల్చినట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు. వాషింగ్టన్ నగరంలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా, 1969లో న్యూయార్క్ నగరంలోని స్టోన్వాల్ ఇన్ గే బార్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గేలు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం గేలు తమ హక్కుల కోసం పోరాడి సాధించారు. అప్పటి నుంచి ప్రతీఏటా జూన్28న గేల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు వీలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.