Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
- డల్లాస్లో ఘటన
వాషింగ్టన్ : అమెరికాలో డల్లాస్ నగరంలోని ఓ అపార్ట్మెంట్పై క్రేన్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఎలన్సిటీ లైట్స్ అపార్ట్మెంట్పై క్రేన్ కూలింది. ప్రతికూల వాతావరణం కారణంగా క్రేన్ కూలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం సంభవించిన సమయంలో బలమైన ఈదురుగాలులు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.