Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో తవ్వకాలు జరుపుతుండగా చిన్నపాటి కుదుపులు సంభవించాయని అధికారులు తెలిపారు. దీంతో పైకప్పు కూలి అనేక మంది గనిలోనే చిక్కుకుపోయారన్నారు. 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఈ గని జిలిన్ లాంగ్జియాబావో మైనింగ్ కార్పొరేషన్ యాజమాన్య పరిధిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మరింత లోతైన విచారణ జరుపుతామని వెల్లడించారు.