Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ కోర్టు
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారించనున్నట్టు వెస్ట్‌మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని వికీలీస్ సంస్థ తస్కరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ లీకేజ్ వ్యవహారంలో అసాంజే కీలక పాత్ర పోషించినట్టు అమెరికా అనుమానిస్తున్నది. అందుకే, విచారణ నిమిత్తం అసాంజేను తమ దేశానికి అప్పగించాలని బ్రిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు చేపట్టిన న్యాయమూర్తి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపడతామని అన్నారు. అమెరికా రక్షణ శాఖకు చెందిన కంప్యూటర్లలోని అతి కీలక సమాచారాన్ని తస్కరించి అసాంజే గూఢచర్యానికి పాల్పడ్డారనే అమెరికా ఆరోపిస్తున్నది. కాగా, అసాంజెపై స్వీడన్లో లైంగిక ఆరోపణల కేసు నమోదై ఉంది. ఈ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు అసాంజె ఈక్వెడార్‌కు పారిపోయారు. అక్కడి ఎంబసీలో ఏడేండ్ల పాటు తలదాచుకున్నారు. ఈ సమయంలో బెయిల్ నిబంధనలను అతిక్రమించారు. బ్రిటన్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. ఈనేపథ్యంలో బ్రిటన్ కోర్టు ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అసాంజేను 50 వారాల పాటు జైలులోనే ఉంచాలని బ్రిటన్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.