Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని పాఠశాలల్లో రోబోలతో విద్యార్థులకు బోధనా తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన స్విన్ బర్నే యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ రోబో విద్యపై మూడేళ్లపాటు పరిశోధన జరిపింది. విద్యార్థులకు రోబోలతో పాఠాలు చెప్పించడం ద్వారా ఉపయోగాలపై అధ్యయనం చేసింది. తమ పరిశోధన ఫలితాలను పరిశీలించడం కోసం ఫ్రెంచ్ రోబోటిక్ కంపెనీ అల్డెబరాన్ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబోట్లతో పాఠాలు చెప్పించేందుకు ఆస్ట్రేలియాలోని రెండు పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థులకు నిజమైన ఉపాధ్యాయులు బోధిస్తున్నట్టే రోబోలతో పాఠాలు బోధించేవిధంగా సాఫ్ట్ వేర్ను రూపొందించారు. దాంతో,రోబోలు విద్యార్థుల మధ్య తిరుగుతూ, మాట్లాడుతూ, డ్యాన్స్ కూడా చేయగలవని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రోబోల ద్వారా పాఠశాలల్లో ఓ విధమైన ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.