Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలోని గ్లూసెస్టర్ కౌంటీని, న్యూయార్క్‌లోని కనెక్టికట్ని ఉప్పెన తాకినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్న దృశ్యాన్ని తాము చూసినట్టు నెటిజన్లు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. టోర్నడోల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించారు. కనెక్టికట్ వంటి ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. నెల రోజుల కాలంలో న్యూజెర్సీని ఈ ప్రకృతి వైపరీత్యం వణికించడం ఇది రెండోసారి. పెన్సిల్వేనియాలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయక చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమైంది.