Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది కెన్యా పోలీసు అధికారులు మృతి
మొగదీషు: సోమాలియా సరిహద్దులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కెన్యా పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....తూర్పు వజీర్ ప్రాంతంలో కాంటాన్ కేంద్రంలో పోలీస్ అధికారులు ప్రయాణిస్తున్న కాన్వారు లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు కోసం ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివీస్) వినియోగించినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది.
అల్షాబాబ్ మిలిటెంట్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ముగ్గురు పోలీస్ అధికారులను అల్ షాబాబ్ మిలిటెంట్లు అపహరించారు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక అధికారుల బృందం గాలింపు చర్యలు చేపడుతున్నది. ఈ అధికారులు ప్రయాణిస్తున్న వాహనం లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. కెన్యాలో 2011 నుంచి అల్షా బాబ్ మిలిటెంట్ల హింసాత్మక దాడులు బాగా పెరిగిపోయాయి. భద్రతా బలగాలు, పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులకు, పేలుళ్లకు పాల్పడుతున్నారు. అల్షా బాబ్ మిలిటెంట్ల ఏరివేత కోసం కెన్యా ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నది.