Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫోనిక్స్ (అమెరికా): పోలీసులు ఆయుధాలు గురిపెట్టి బెదిరిస్తూ ఒక చిన్నారి కుటుంబాన్ని అరెస్ట్ చేసిన ఉదంతంపై ఫోనిక్స్ నగర మేయర్ ఆ కుటుంబానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కుటుంబ సభ్యులు దగ్గర్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్‌కు వెళ్లినపుడు వారిలోని నాలుగేళ్ల చిన్నారి ఒక బొమ్మను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినట్టు అక్కడి సిసిటీవీ కెమెరాల వీడియో ద్వారా వెల్లడ యింది. ఆ షాపు సిబ్బంది తమ షాపులో చోరీ జరిగినట్లు పోలీసులకు చెప్పటంతో స్పందించిన పోలీసులు పక్కనే ఉన్న పార్కింగ్ ఏరియాలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను ఆయుధాలు గురిపెట్టి తమకు లొంగిపోవాలని బెదిరించారు. వాస్తవానికి ఈ చిన్నారి తన వెంట బొమ్మ తీసుకు వచ్చిన సంగతి తమకు తెలియదని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అయినప్పటికీ వారి వాదనను పట్టించుకోని పోలీసులు వారికి ఆయుధాలను గురిపెట్టి చేతులెత్తి తమకు లొంగిపోవాలని బెదిరించినట్లు ఒక సెల్‌ఫోన్ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుం డటంతో నగర మేయర్ కేట్ గాల్లెగో ఆ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
ఇకపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు నడుం బెల్ట్‌కు అమర్చుకునే కెమెరాలను అందచేస్తామని, వాటిని ఉన్నతాధికారుల కార్యాలయానికి అనుసం ధానించటం ద్వారా వారి దురుసు ప్రవర్తనపై వెంటనే స్పందించేందుకు వీలుంటుందని ఆమె వివరించారు. పోలీసుల ఇటువంటి ప్రవర్తనక్ష మార్హం కానిదని, చిన్నారికి తుపాకి గురిపెట్టి నపుడు ఆమె భయంతో వణికిపోయిందని, ఒక తల్లిగా తనకు ఆ బాధ తెలుసునని మేయర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.