Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకాస్: వెనిజులా స్వయంప్రకటిత తాత్కాలిక అధ్యక్షుడు జువాన్ గైడోకు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అరెస్ట్ అయ్యారు. దొంగిలించిన సైనిక ఆయుధాలను విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆ దేశ సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ వెల్లడించారు. ఆదివారం మీడియా సమావేశంలో రోడ్రిగ్జ్ మాట్లాడారు. అధ్యక్షుడు నికొలస్ మదురోకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో వినియోగించిన సైనిక ఆయుధాల చోరీలో గైడో ప్రమేయంపై తమ వద్ద అనేక ఆధారాలున్నాయని చెప్పారు. ఏప్రిల్30న జరిగిన విఫల సైనిక కుట్రలో వినియోగించిన ఆయుధాలను అదే రోజు గైడో సెక్యూరిటీ గార్డ్లు కొందరు తస్కరించినట్టు తమకు ఆధారాలు లభించాయని ఆయన వివరించారు. ఇందులో ఇద్దరుసెక్యూరిటీ గార్డులు ఈ ఆయుధాలను 35 వేల అమెరికన్ డాలర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. వారి నుండి ఐదు ఏకే-103 రైఫిల్స్‌ను, వాటిలో అమర్చే ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు.