Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్, అమెరికా చర్యలకు చైనా ఖండన
బీజింగ్ : దక్షిణచైనా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు చైనా రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తైవాన్, అమెరికాకు ఘాటుగా హెచ్చరించింది. కాగా, తైవాన్ను తమ దేశంలో అంతర్భాగంగానే చైనా భావిస్తోంది. 'వన్‌చైనా' పాలసీకి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఆకాంక్షిస్తోంది. అయితే, అగ్రరాజ్యం మాత్రం తన వక్రబుద్ధితో తైవాన్, చైనా మధ్య చిచ్చుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వన్‌చైనా విధానానికి విరుద్ధంగా తైవాన్‌కు ఆయుధాలను సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. 2.2బిలియన్ డాలర్ల విలువైన క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధాలు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. తైవాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అమెరికాను హెచ్చరించింది. వన్‌చైనా విధానాన్ని గౌరవించాలని అమెరికాను కోరింది. ఒకవేళ తైవాన్‌తో కుదుర్చుకున్న ఆయుధాల సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినట్టయితే అమెరికా ఉత్పత్తులపై భారీ ఆంక్షలు విధిస్తా మని హెచ్చరించింది. కాగా, తైవాన్ అధ్యక్షుడు సరుఇంగ్వెన్ గతవారం అమెరికాలో పర్యటిం చారు. అమెరికా, తైవాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిం చారు. యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సి పెలోసీ, సరుఇంగ్వెన్ మధ్య టెలి ఫోన్ సంభాషణ జరిగినట్టు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ సరుమింగ్ యెన్ ప్రకటించారు. తైవాన్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపారు. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. దక్షిణచైనా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది.