Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా : మేయర్ హాన్ క్యూయు
తైపీ : తైవాన్ చైనాలో అంతర్భాగమేనని మేయర్ హాన్ క్యూయు తెలిపారు. వన్‌చైనా విధానానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని కోరారు. జనవరిలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. క్యుమింగ్టాంగ్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్టు హాన్ క్యూయు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో సైఇంగ్వెన్పై గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. తాను చైనాకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. కాగా, చైనాలో అంతర్భాగమైన తైవాన్ కొంతకాలంగా అమెరికాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, తైవాన్ చర్యలను ఓ కంట కనిపెడుతున్న చైనా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అమెరికా నుంచి క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలు చేయాలని తైవాన్ నిర్ణయించుకుంది. ఈమేరకు ఇరుదేశాల మధ్య 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
తైవాన్‌కు, చైనాకు మధ్య చిచ్చురేపేందుకు అమెరికా కుటిల యత్నాలు చేస్తున్నది. చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినట్టయితే చర్యలు తప్పవని అమెరికా, తైవాన్లను చైనా ఘాటుగా హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది.