Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెమాస్కస్: అమెరికా బెదిరింపులను ఎదుర్కొంటున్న ఇరాన్‌కు సిరియా అధ్యక్షుడు అసద్ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఇరాన్ షురా కౌన్సిల్ అంతర్జాతీయ వ్యవహారాల అసిస్టెంట్ స్పీకర్ హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌తో ఆయన మాట్లాడారు. సిరియా వైఖరిని పునరుద్ఘాటించారు. ఇరువురు నేతలూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబందాలతో పాటు ఇరాన్ అణు సమస్య వంటి వర్తమాన పరిణామాలు, ఇరాన్ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సిరియా అధ్యక్ష కార్యాలయ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఎనిమిదేండ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో పశ్చిమ దేశాల మద్దతు కలిగిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అసద్‌కు ఇరాన్ అండగా నిలిచిన విషయం తెలిసిందే.