Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఇతర దేశాల నుంచి మెక్సికో మీదుగా తమ దేశంలో ప్రవేశించే వారంతా తమ దేశంలో ఆశ్రయం పొందేందుకు అనర్హులేనని ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన వలసలకు సంబంధించిన కొత్త నిబంధన మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. అక్రమ వలసలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను రూపొందించటంలో యూఎస్ కాంగ్రెస్ వైఫల్యంపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. వలసలపై ఉక్కు పాదం మోపాలన్న తాజా వలస విధానానికి అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. అమెరికా అత్యంత ఉదారమైన దేశమని, అయితే ప్రస్తుతం దక్షిణ ప్రాంత సరిహద్దుల నుంచి దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న లక్షలాది మందితో అనేక సమస్యలు ఎదుర్కొంటోందని అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ ఆరోపించారు. తాజాగా అమలులోకి తెచ్చిన నిబంధన ద్వారా అక్రమ వలసవాసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన ప్రకటించారు.