Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది 'మీ, మా కాదు... మన అందరి అమెరికా!'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ మండి పడ్డారు. అమెరికా దిగువ సభలోని డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ చేసిన వ్యాఖ్య లను ఆమె తప్పు పట్టారు. 'ఇది మీ, మా కాదు... మన అందరి అమె రికా' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. 'ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యం. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అందాన్ని చూస్తున్నాను. మనం ఇక్కడ పుట్టిన వారమే కావచ్చు లేదంటే వలస వచ్చిన వారమే కావచ్చు.. కానీ, ప్రతి ఒక్కరికి ఈ నేలపై హక్కుంది. మనం ఒక్క విషయం తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. అమెరికా మీదో, మాదో కాదు. మనందరి అమెరికా' అని మిషెల్లీ ట్విటర్లో చురకలు అంటించారు. ఓ ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దిగువ సభలోని నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ మండిపడ్డారు. 'అమెరికాలో మీరు సంతోషంగా లేకపోతే మీరు పుట్టిన స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తుత్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి వివక్ష వ్యాఖ్యలంటూఆయన ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు.