Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలో ఘటన
సిడ్నీ : ఆస్ట్రేలియా దారుణం చోటుచేసుకుంది.25 ఏండ్ల యువతి తన తల్లిని హత్య చేయడమే కాకుండా, తల నరికి ఇంటి ముందున్న రోడ్డుపై పడేసిన వైనం పోలీసులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.నేపాన్ ఏరియా డిటెక్టివ్ కమాండర్ బ్రెట్ మెక్ఫాడెన్ తెలిపిన వివరాల ప్రకారం.... సిడ్నీ నగరంలో శనివారం రాత్రి ఓ ఇంట్లో 57 ఏండ్ల మహిళ మొండేన్ని కనుగొన్నారు. ఈ ఘటనలో మృతురాలి కుమార్తెను అరెస్ట్ చేశారు. తల్లి తలను పొరుగింటి గార్డెన్ కు ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై పారవేస్తుండగా ఓ బాలుడు చూశాడు. కుమార్తెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు అనంతరం ఆమెను ఆస్పపత్రికి తరలించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్నారు. కాగా, ఆమె తన తల్లి తలతో ఇంటి బయటికి రావడాన్ని నాలుగేండ్ల బాలుడు చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి కూడా హంతకురాలికి బంధువే. భయంతో పరుగు తీసే క్రమంలో కిందపడిన బాలుడి తలకు దెబ్బతగలడంతో ప్రస్తుతం ఆస్పపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతటి ఘోరమైన హత్యను ఎన్నడూ చూడలేదని సిడ్నీ పోలీసులు చెబుతున్నారు.