Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైరోబి: అవినీతి ఆరోపణల కేసులో కెన్యా ఆర్థిక మంత్రి హెన్రీ రోటిచ్ అరెస్ట్ అయ్యారు. ఇటలీకి చెందిన రెండు కన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి 450 మిలియన్ డాలర్ల (రూ. 3,101 కోట్లు) ముడుపులు స్వీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టులకు సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీలకు, రోటిచ్ మధ్య చీకటి ఒప్పందం కుదిరినట్టు కెన్యా ప్రాసిక్యూషన్ కార్యాలయం అనుమానిస్తున్నది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని రోటిచ్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.