Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యాతో కలిసి యుద్ధ విమానాల విడిభాగాలు తయారు చేయనున్నట్టు టర్కీ వెల్లడించింది. కాగా, రష్యా నుంచి ఎస్-400 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు టర్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యాలో తయారవుతున్న అధునాతన యుద్ధ విమానాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయని పేర్కొంది. తమ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో యుద్ధ విమానాలను, క్షిపణులను, ఆయుధాలను కొనుగోలు చేయనున్నట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు. అయితే, రష్యా-టర్కీ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని టర్కీపై ఒత్తిడి పెంచింది. అమెరికా ఒత్తిడికి టర్కీ తలొగ్గకపోవడంతో ఎర్డోగన్ సర్కార్‌పై భారీ ఆంక్షలు మోపింది.