Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్, రిప్లబికన్ పార్టీ మాజీ సెనెటర్ డాన్ కోట్స్‌ను పదవి నుంచి తొలగించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని కోట్స్ ఆరోపణ. ఈ అంశంపై ఆయన తన రెండేండ్ల పదవీకాలంలో ట్రంప్‌తో అనేకసార్లు విబే ేధించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని పట్టుపట్టారు. ట్రంప్‌కు, కోట్స్‌కు మధ్య అనేకసార్లు ఈ అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. కోట్స్‌ను యూఎస్ నిఘా ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించాలని ట్రంప్ నిర్ణయించారు. వచ్చేనెల 15లోపు కోట్స్ వైదొలగాలని ఆదేశించారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌కు త్వరలో యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు.