Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిప్పికొట్టడంలో సెనెట్ వైఫల్యం
వాషింగ్టన్: సౌదీ అరేబియాకు కొన్ని రకాల ఆయుధాలను విక్రయించటంపై నిషేధం విధిస్తూ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వీటోను తొలగించటంలో సెనేట్ విఫలమైంది. అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు తొలిసారి ప్రయత్నించిన సెనేట్ ఇందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ సాధనలో విఫలమైంది. దీనితో ఆయుధ విక్రయాలపై కాంగ్రెస్ ఆమోదించిన నిషేధంపై స్టే యధావిధిగా కొనసాగనుంది.
ట్రంప్ వీటోను తొలగించే బిల్లును సమర్ధించే సభ్యులు సభలో మెజార్టీ సంఖ్యలో ఉన్నప్పటికీ ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ లభించకపోవటంతో బిల్లుకు ఆమోదం లభించలేదని సెనేట్ వర్గాలు వివరించాయి.