Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదు
సాన్ సాల్వడార్ : ఎల్‌సాల్వడార్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.9గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. లా లిబర్టాడ్ నగరం నుంచి 24కిలోమీటర్ల దూరంలో 72.5కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అన్నారు. భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు