Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై ట్రంప్ ధీమా
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ సర్కారే గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇరాన్, చైనా దేశాలు భావిస్తున్నాయని ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించినప్పుడూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అమెరికా అధ్యక్షుడి బాధ్యతలను రెండోసారి చేపట్టడం చైనాకు ఇష్టం లేదన్నారు. దేశ ప్రజల్లో తనపై వ్యతిరేకతను పెంచుతోందని ఆరోపణలు చేశారు. ఇటీవలి కాలంలో ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అణు ఒప్పందం అంశంపై ఇరాన్‌కు పలుమార్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది అమెరికా.