Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ రాజీనామాకు డిమాండ్
సాన్జువాన్: ప్యుయెర్టో రికోలో నిరసనలు కొనసాగుతున్నాయి. గవర్నర్ రికార్డో రోసెల్లో తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్యుయెర్టో రికో విదేశాంగ మంత్రిగా తన సన్నిహితుడు, న్యాయవాది పెడ్రో పీర్లూసీని నియమించాలని రికార్డో భావిస్తున్నారు. రికార్డో, పెడ్రో మధ్య జరిగిన రహస్య సంభాషణలు, సంక్షిప్త సందేశాలు లీకయ్యాయి. దీంతో, ప్రజలు రికార్డో రాజీనామా కోసం డిమాండ్ చేశారు. వీధుల్లోకి చేరుకొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రికార్డో తన తప్పును అంగీకరించి రాజీనామాకు సిద్ధపడినట్టు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. కాగా, పెడ్రో ఓనీల్ అండ్ బోర్గెస్ అనే లాఫర్మ్ను నిర్వహిస్తున్నారు. ఆయనపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పెడ్రోను విదేశాంగ మంత్రిగా తాము అంగీకరించబోమంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.