Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య, మాజీ తొలి మహిళ మిషెల్ ఒబామా స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని పలువురు కోరుతున్న నేపథ్యంలో ఆమె దానిపై స్పష్టత నిచ్చారు. దేశాన్ని అభివృద్ధిలో నడిపించేం దుకు పలు ఇతర మార్గాలున్నా యని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ''అమెరికాను అభివృద్ధి చేయడానికి, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడా నికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో భాగంగానే దేశంలోని పలు కుటుంబాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి, యువ కార్యకర్తలతో కలిసి పలువురికి సాయం చేస్తున్నాను. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటే సామాజిక కార్యక్రమాల్లో భాగం కాలేను.'' అని ఆమె అన్నారు.