Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీకి చెందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సంస్థపై అధికారులు దర్యాప్తు ప్రారంభించటంపై ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నిరోధించేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతోందని ప్రదర్శనలో పాల్గొన్న పలువురు ఆందోళనకారులు విమర్శించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1,400 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.