Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: వరుసగా 38వ వారం చేపట్టిన యెల్లోవెస్ట్స్ నిరసనలపై ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. నాంటెస్ నగరంలో పోలీసులు యెల్లోవెస్ట్స్ నిరసనకారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రదర్శకులపై పోలీసులు బాష్పవాయువు, నీటి గోళాలు, రబ్బర్ బులెట్లను ప్రయోగించారు. ఈ నిర్బంధ కాండలో పలువురు గాయపడ్డారు. వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 30న లాయిర్ నదిలో మునిగి చనిపోయిన యువ నిరసనకారుడు స్టీవ్ కేనికోకు తగు న్యాయం చేయాలని నిరసనకారులు నినదించారు. శనివారం నాటి ఘటనలపై దర్యాప్తు జరిపిస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.