Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్లో ఘటన
- డ్రగ్స్డాన్ను మరోసారి అదుపులోకి తీసుకున్న అధికారులు
బ్రసీలియా : మారు వేషంలో జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ కరుడుగట్టిన నేరస్థున్ని అధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. రియోడీ జనీరియా జైలులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...జీవితఖైదు అనుభవిస్తున్న డ్రగ్స్డాన్ సిల్వ (42) జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పలు కేసుల్లో అతను దోషిగా తేలాడు. జైలు నుంచి తప్పించుకునేందుకు అతను ఎంచుకున్న ప్రణాళిక అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అతనికి క్లవునోడా సిల్వ (21) అనే కుమార్తె ఉన్నది. తండ్రిని కలిసివెళ్లేందుకు ఆమె తరుచూ జైలుకు వస్తుండేది. ఇదే అదనుగా భావించిన సిల్వా....తన కూతురు మారువేషంలో జైలు నుంచి తప్పించుకోవాలని మాస్టర్‌ప్లాన్ వేశాడు. అవసరమైతే ఆమెను జైలులోనే ఉంచి తాను పరారు కావాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాకుండా, జైలు గార్డు సహకారంతో తన కుమార్తె రూపంలో ఉండే మాస్కు, శిరోజాలు తదితర వస్తువులను తెప్పించుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన జైలు అధికారులు అతని బ్యారక్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహించగా ప్రణాళిక బట్టబయలైంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని మరో బ్యారక్‌కు తరలించినట్టు జైలు అధికారులు తెలిపారు.