Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురికి గాయాలు
ఒట్టావా: కెనడాలోని టొరంటో నైట్‌క్లబ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. టొరంటో డీఎస్పీ స్టేసీ డేవిడ్ తెలిపిన వివరాల ప్రకారం....టొరంటో నైట్‌క్లబ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. నైట్‌క్లబ్‌లోకి చొరబడిన ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కాల్పులు చోటుచేసుకున్న సమయంలో నైట్‌క్లబ్‌లో 250 మంది ఉన్నట్టు సమాచారం. కాల్పులకు పాల్పడ్డ అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటనపై టొరంటో మేయర్ జాన్ టోరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.