Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్కెళ్లిన పోలీస్ అధికారులు
- అమెరికాలో జాతి విద్వేష ఘటన...
- ఫొటో వైరల్ కావడంతో యూఎస్‌లో ఆగ్రహ జ్వాలలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్‌లో జాతి విద్వేష ఘటనలు బాగా పెరిగిపోయాయి. నల్ల జాతీయులపై, మైనారిటీలపై దాడులు అధికమ య్యాయి. అమెరికాలో నివసిస్తున్న నల్లజాతీయులు అభద్రతా భావంతో జీవనం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. నల్లజాతీయుల పట్ల శ్వేత జాతీయులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తున్నది. తాజాగా, ఇద్దరు అమెరికా పోలీస్ అధికారులు గుర్రాలతో స్వారీ చేస్తూ ఓ నల్లజాతీయున్ని తాడుతో లాక్కెళ్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఈ ఫొటోను వీక్షించిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజాతీయుడి పట్ల అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనలు భగ్గుమన్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎండగట్టారు. అమెరికా పోలీస్ అధికారుల్లో జాత్యహంకార భావాలు పెరిగిపోయాయనేందుకు ఇదో ప్రత్యక్ష తార్కాణమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ఆఫ్రికన్ అమెరికన్ ఒకవేళ నేరం చేసినట్టయితే అతన్ని విచారించి చట్టపరంగా శిక్షించాలి... అంతేగానీ, పోలీసులు అమానవీ యంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు?- అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ దురాగతానికి పాల్పడ్డ పోలీస్ అధికారులపై చర్యలు చేపడతామని గాల్వెస్టాన్ ఎస్పీ వెర్నాన్ హేల్ తెలిపారు. నల్లజాతీయుడికి జరిగిన అవమానానికి పోలీస్ శాఖ తరుఫున తాను క్షమాపణలు చెబుతు న్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటోపై వివరణ ఇచ్చారు. డొనాల్డ్ నీలీ అనే ఆఫ్రికన్ అమెరికన్ నిషేధిత ప్రాంతంలోకి చొరబడేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడని అన్నారు. పోలీస్ అధికారులు నింది తుని చేతులకు తాడు చుట్టి లాకె ్కళ్లడం తప్పేనని అన్నారు. నిందితున్ని జామీనుపై విడుదల చేశామని అన్నారు. నల్లజాతీయుడి అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై స్టాన్‌ఫర్డ్ యూని వర్సిటీ ప్రొఫెసర్ క్లేబోర్న్ కార్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రంప్ సర్కార్ చూసుకోవాలంటూ అభ్యర్థించారు.