Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంగ్‌కాంగ్‌లో లాయర్ల నిరసన ప్రదర్శనలు
- నిందితులను చైనాకు తరలించే బిల్లును రద్దు చేయాలని డిమాండ్
హాంగ్‌కాంగ్ : హాంగ్‌కాంగ్ నగరంలో లాయర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నేరారో పణలు ఎదుర్కొంటున్న నిందితు లను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని హాంగ్‌కాంగ్ సర్కారు యోచి స్తున్నది. ఈమేరకు ఓ బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లుపై హాంగ్‌కాంగ్ పౌరుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరారోపణులు ఎదుర్కొంటున్న నిందితులను విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని మెజారిటీ పౌరులు ఆకాంక్షిస్తున్నారు. వందలాది మంది మాత్రం బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిందితులను చైనాకు అప్పగించినట్టయితే హాంగ్‌కాంగ్ న్యాయవ్యవస్థ మసకబారే ప్రమాదముందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులకు, బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చాయి. రెండు నెలల నుంచి కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా బిల్లు ప్రతిపాదనను సీఈవో క్యారీ లామ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈబిల్లును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన బాటపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి ర్యాలీ తీశారు. లాయర్లు తీసిన ర్యాలీకి హాంగ్‌కాంగ్ ఎమ్మెల్యే మార్టిన్ లీ నేతృత్వం వహించారు.